గుక్కెడు నీటికి ...పుట్టెడు కష్టాలు


గుక్కెడు నీటికి ...పుట్టెడు కష్టాలు 
అడగంటిన భూర్భజలాలు జిల్లాలో
2015 మార్చిలో 7.19 మీటర్లు దిగువన ఈ ఏడాది మార్చిలో 1225 మీటర్ల లోతులో
పెరిగిన ఎండలతో గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నారు. కోటప్పకోండ తిరునాళ్ల సందర్భంగా విడుదల చేసిన సాగర్ జలాలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో చెరువులకు చేరకముందే నిలిచిపోయాయి. చిలకలూరిపేట మేజర్ ద్వారా చివరి ప్రాంతంలో ఉండే చెరువుకు వారం రోజుల్లో నీరు చేరటానికి ఐదు రోజుల సమయం పట్టింది. రెండురోజులు పాటు మాత్రమే అరాకొరా నీటి సరఫరా జరిగింది. మరోవైపు భూర్భజలాలు ఎన్నడు లేని విధంగా అట్టడగుకు చేరాయి. ఈ ఏడాది విడుదల చేసిన సాగర్ జలాలతో అరకొర నీటిసరఫరా జరిగినా అవి పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలను తీర్చలేకపోయాయి. వాగులు, పొల్లాలో ఉండే నీటి గుంటలు సైతం ఎండిపోవటంతో పశువులకు సైతం నీరు అందని పరిస్థితి నెలకొంది. రానున్నరోజుల్లో మరింతగా దిగజారే అవకాశం ఉందని భావిస్తున్నారు. నీటి కష్టాలు మొదలు. మున్సిపాలిటి,లేదా పంచాయతీల ద్వారా సరఫరా అయ్యే నీటితో నిమిత్తం లేకుండా బోర్లు, బావుల ద్వారా నీటిని తోడి అవసరాలకు వినియోగించుకుందామంటే భూర్భజలాలు కూడా అడుగంటతంతో అందోళన మొదలైంది. శాస్త్రీయ అంచనాల ప్రకారం ప్రతి మనిషి అవసరాల నిమిత్తం 135 లీటర్ల నీరు అవసరమాతుంది. నీటి అవసరాల కోసం భూగర్భజలాలపై అధారపడటంతో భవిష్యత్తు అంధకారంగా మారనుంది. గ్రామాల్లో ఉన్న అన్ని చెరువుల్లో, బావుల్లో సైతం నీరు ఇంకిపోయింది. గత 50 సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా వాగులు, చెరువులు పూర్తిస్థాయిలో ఎండిపోవటంతో వాగులపై ఆధారపడిన రైతులు, పశువులకు కూడా నీరు అందని పరిస్థితికొని ఉంది. నానాటికి పడిపోతున్న భూర్భజలాలు. గత ఏడాదితో పోల్చిచూస్తే ఈ భూర్భజలాలు పూర్తి స్థాయిలో భూమి అట్టడుగు పొరలకు చేరుకుంటున్నాయి.

Popular Posts